HomeTelugu Trendingఓటీటీలో 'సీతారామం'.. రిలీజ్‌ డేట్‌ ప్రకటన

ఓటీటీలో ‘సీతారామం’.. రిలీజ్‌ డేట్‌ ప్రకటన

Sita rama movie on prime fr
కోలివుడ్‌ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. చిన్న సినిమాగా ఆగస్టు 5 విడుదలై తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ఆకట్టుకుంది. మంచి కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించింది. దాంతో, విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకు మరింతగా ఆదరణ లభిస్తోంది. రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్, వైజయంతి మూవీస్ బ్యానర్స్ పై సి. అశ్వనీదత్ నిర్మించారు.

ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 9 నుంచి అమెజాన్ ప్రైమ్‌ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ లో సినిమా అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu