HomeTelugu Trendingకల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా టైటిల్‌ ఇదేనా!

Kalyanram 19th movie update
నందమూరి కల్యాణ్ రామ్ 19వ సినిమాను మైత్రీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ షూటింగ్‌ జరుపుకుంది. ఇటీవలే గోవా షెడ్యూల్ ను పూర్తిచేసిన టీమ్, చివరి షెడ్యూల్ షూటింగుకి సన్నాహాలు చేస్తున్నారు. రాజేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూడు పాత్రల మధ్య వేరియేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. కథాపరంగా ఈ సినిమాకి ‘ఎమిగోస్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపుగా ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu