కమల్, గౌతమిలు విడిపోయారు!

కమల్ హాసన్ 2005వ సంవత్సరం నుండి నటి గౌతమితో సహజీవనం చేస్తోన్న విషయం
అందరికీ తెలిసిందే. రీసెంట్ గా గౌతమి క్యాన్సర్ తో పోరాడుతున్న సమయంలో కమల్
మానసికంగా ఆమెపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకున్నారు. సౌత్ ఇండియాలో స్టార్
కపుల్స్ లో ఒకరిగా ఉన్న వీరు ఇప్పుడు విడిపోతున్నామని గౌతమి స్వయంగా వెల్లడించారు.
”ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి బాధగా ఉన్నప్పటికీ తీసుకోక తప్పడం లేదు.. ఒక బంధంలో
ఇద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకరికొకరివి భిన్నంగా మారిపోయిన తరువాత వారిద్దరు
సర్ధుకొని బ్రతకాలి లేదంటే ఆ బంధం నుండి విడిపోవాలి. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి
చాలా రోజులుగా ఆలోచించాను. ఇక ఇదే సరైన నిర్ణయమని నిశ్చయించుకున్నాను. నటుడిగా,
ఫిల్మ్ మేకర్ గా ఆయన ఎన్నో అద్బుతాలు సృష్టించారు. ఆయన చేసిన సినిమాలకు నేను
పని చేసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇకపై కూడా ఆయన చేసే పనులను నేను అభినందిస్తూనే
ఉంటాను. మొదటి నుండి నా వ్యక్తిగత విషయాలను అందరితో షేర్ చేసుకుంటూనే ఉన్నాను.
అందుకే ఈ విషయాన్ని కూడా చెబుతున్నాను” అంటూ ఓ ప్రకటనలో వెల్లడించారు.