నిఖిల్‌ పేరు మార్చుకుంటున్నాడు!

యంగ్‌ హీరో నిఖిల్, దర్శకుడు సంతోష్ కలిసి ఒక చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట్లో ‘ముద్ర’ అనే టైటిల్ పెట్టారు. కానీ ఇదే పేరుతో మోనెనే మధ్య జగపతిబాబు ప్రధాన పాత్రలో రూపొందిన ఒక సినిమా విడుదలైంది. రెండు సినిమాల టైటిల్స్ ఒకేలా ఉండటంతో ఆ చిత్ర నిర్మాత, నిఖిల్ మధ్య వివాదాలు చెలరేగాయి.

ప్రస్తుతం నిఖిల్ అండ్ టీమ్ తమ సినిమాకు టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నారు. సినిమాకు పేరు సజెస్ట్ చేయండి అంటూ ప్రేక్షకుల్ని కోరారు. ఈ చిత్రంలో నిఖిల్ ఒక జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది.