HomeTelugu Big Storiesకమల్‌హాసన్‌- మణిరత్నం మూవీ టైటిల్‌ ఫిక్స్‌

కమల్‌హాసన్‌- మణిరత్నం మూవీ టైటిల్‌ ఫిక్స్‌

kamal haasan 234 movie titl

కోలీవుడ్‌ స్టార్‌ హీరో కమల్ హాసన్- లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కమల్ కెరీర్ లో 234వ చిత్రం. రేపు (నవంబర్ 7) కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్‍‍తో పాటు ఈ చిత్రంలో కీలకపాత్రలు ఎవరు చేస్తున్నారో వెల్లడించారు.

ఈ సినిమాకు థగ్ లైఫ్ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్‍స్టర్, క్రిమినల్‍గా కమల్ నటించనున్నారని ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు’ అని ఈ వీడియోలో కమల్ హాసన్ డైలాగ్ చెప్పారు.

ఈ వీడియో ఆరంభంలో కమల్ తలపై ఓ ముసుగు ఉంది. కొందరు కమల్ వైపుకు దూసుకొస్తారు. వారందరినీ కమల్ బాదేస్తారు. ఈ సినిమాలో కమల్‌ లుక్‌ చాలా డిఫరెంట్‍గా ఉంది. యాక్షన్ సీన్‍తో ఈ వీడియో అదిరిపోయింది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‍గా నటిస్తుంది. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, తమిళ హీరో జయం రవి చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు.

ఈ విషయాన్ని మూవీ యూనిట్ నేడు ప్రకటించింది. థగ్ లైఫ్ సినిమాను కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్.. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu