ట్రోల్‌ అవుతున్న రకుల్‌, లక్ష్మీ మంచు ఫొటో

టాలీవుడ్‌ నటి రకుల్ ప్రీత్ సింగ్ పై ఓ ఫొటో కారణంగా విమర్శలు చెలరేగుతున్నాయి. లక్ష్మీ మంచుతో కలిసి రకుల్ దిగిన ఓ ఫొటో ఇప్పుడు ఆమెపై రకరకాల విమర్శలకు తావిస్తోంది. నీరజ కోన, లక్ష్మి మంచుతో కలిసి శ్రీలంక టూర్ కు వెళ్లింది రకుల్. ఆ టూర్ లో భాగంగానే లక్ష్మీ మంచుతో ఇలా క్లోజ్ గా ఫొటో దిగింది. నీరజా కోన క్లిక్ మనిపించిన ఈ స్టిల్ ను రకుల్ తన ఫేస్ బుక్, ఇనస్టాగ్రామ్ ఖాతాల్లో పెట్టింది. ఇక అప్పట్నుంచి ఆమెపై ట్రోలింగ్ మొదలైంది.

లక్ష్మీ మంచుతో దిగిన పోజు అస్సలు బాగాలేదంటూ రకుల్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఓ హీరోయిన్ ను హీరో ముద్దాడుతున్నట్టున్న పోజులో ఇద్దరు మహిళలు ఉండడం ఏంటంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. తమమధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ను చూపించడంలో రకుల్ హద్దులు దాటేసిందని కొందరు అంటే, సుప్రీంకోర్టు తీర్పును వీళ్లిద్దరూ మరోసారి గుర్తుచేశారంటూ ఇంకొందరు జోకులు వేస్తున్నారు.

వెనక నుంచి గట్టిగా కౌగిలించుకొని ముద్దుపెట్టే సన్నివేశం చూడ్డానికి కాస్త అభ్యంతరకరంగానే ఉన్నప్పటికీ, ఈ పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎంత ట్రోలింగ్ జరుగుతుందో, అదే స్థాయిలో షేరింగ్ లు కూడా కొనసాగుతున్నాయి. రకుల్ మాత్రం ఈ ట్రోలింగ్ ను పట్టించుకోకుండా చక్కగా తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో టార్గెట్ గా మారడం రకుల్ కు కొత్తకాదు. గతంలో డ్రెస్సింగ్ విషయంలో ఓసారి ట్రోలింగ్ కు గురైంది ఈ ముద్దుగుమ్మ.