HomeTelugu NewsKamal Haasan: కల్కిలో తన పాత్రపై అప్డేట్ ఇచ్చిన నటుడు

Kamal Haasan: కల్కిలో తన పాత్రపై అప్డేట్ ఇచ్చిన నటుడు

Kamal Haasan comments on his role in Kalki

Kamal Haasan in Kalki 2898 AD: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల కల్కి టీమ్ ఇటలీలో ఓ షూటింగ్ షెడ్యూల్ ముగించింది. ప్రభాస్-దిశా పటానిపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించారు.

ఈ సినిమాలో కోలీవుడ్‌ స్టార్‌ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కమల్ హాసన్. ఈ సినిమాలో తాను అతిథి పాత్రలో మాత్రమే నటిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో కమల్ క్లారిటీ ఇచ్చారు. అలాగే తన పాత్ర షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని అన్నారు.

అయితే చాలా మంది కమల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారని అనుకున్నారు. విక్రమ్‌ సినిమాలో చివరిలో వచ్చే రోలెక్స్ పాత్రలా ఉంటుందేమో అంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దీంతో కల్కీలో కమల్ పాత్ర పెద్దగా స్కోప్ లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే విక్రమ్‌లో సూర్య చేసిన ఈ రోలెక్స్ పాత్ర కేవలం 5 నిమిషాలే ఉన్నా ఫ్యాన్స్‌కి మాత్రం తెగ నచ్చేసింది. తర్వాత పార్ట్‌పై భారీ అంచనాలు పెంచేలా చేసింది రోలెక్స్ క్యారెక్టర్. ఇక కమల్ పాత్ర కూడా అలానే ఉంటుందేమో అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కల్కి సినిమా వాయిదా పడే అవకాశాలు తెలుస్తుంది. కానీ మూవీ టీమ్ మాత్రం ఇప్పటివరకూ సినిమా రిలీజ్ వాయిదావై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu