HomeTelugu News'కాలీఫ్లవర్‌' సంపూర్ణేశ్‌ బాబు న్యూలుక్‌

‘కాలీఫ్లవర్‌’ సంపూర్ణేశ్‌ బాబు న్యూలుక్‌

Sampoorneshbabu cauliflowe
టాలీవుడ్ నటుడు సంపూర్ణేశ్ బాబు హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘కాలీఫ్ల‌వ‌ర్‌’. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్త‌యింది. ఈ మూవీ మేక‌ర్స్ కాలీఫ్లవ‌ర్ స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి అంద‌రినీ ఆశ్య‌ర్యంలో ముంచెత్తారు. పోస్ట‌ర్ లో సంపూ శ్రీకృష్ణుడు వేష‌ధార‌ణ‌తో.. న్యూ లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఇండియాకు వ‌చ్చి భార‌తీయ స్త్రీ ప‌విత్ర‌త‌ను చెప్పే పాత్ర‌లో ఆంగ్లేయుడు పాత్ర‌లో సంపూ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. వ‌సంతి ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఆర్ కే మ‌లినేని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీధ‌ర్ గూడూరు స‌మ‌ర్ఫ‌ణ‌లో మ‌ధుసూద‌న క్రియేష‌న్స్ అండ్ రాధాకృష్ణ టాకీస్ బ్యాన‌ర్ల‌పై ఆశాజ్యోతి గోగినేని ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ టీజర్‌ మంచి స్పందన వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu