శంకర్‌ తరువాత చిత్రం ప్రకటించేశాడు

ప్రముఖ దర్శకుడు శంకర్ నెక్స్ట్ సినిమాను అప్పుడే ప్రకటించేశాడు. రజనీ రోబో 2పాయింట్ ఓ సినిమా చివరి దశకు చేరుకున్నది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. నవంబర్ 29 వ తేదీన సినిమా విడుదల కానున్నది. ఇదిలా ఉంటె, ఒకవైపు రోబో 2 ఎండింగ్ కార్యక్రమాలను చూసుకుంటూనే మరోవైపు భారతీయుడు2 సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్‌.

కమల్ హాసన్ హీరోగా రాబోతున్న ఈ సినిమా తమిళ బిగ్ బాస్ 2 కంప్లీట్ అయ్యాక సెట్స్ మీదకు వెళ్తుంది. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నది.