HomeTelugu Trendingవెట్రిమారన్‌తో కమల్‌ హాసన్‌ మూవీ!

వెట్రిమారన్‌తో కమల్‌ హాసన్‌ మూవీ!

Kamal Haasan movie with vet
‘ఆదు కలమ్‌’, ‘విశారణై’, ‘అసురన్‌’ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెట్రిమారన్‌. తాజాగా విశ్వనటుడు కమల్ హాసన్‌తో ఓ సినిమా చేయనున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. దాదాపు 100 కోట్ల బడ్జట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఓ పాపులర్ తమిళ నవల స్ఫూర్తి అని తెలిసింది. కమల్‌హాసన్‌ ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో ‘విక్రమ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కమల్ హాసన్ పలు సినిమాలతో విక్రమ్, ఇండియన్ 2, శభాష్ నాయుడు, పాపనాశంలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు వెట్రీ మారన్ ప్రస్తుతం సూరి- విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో ‘విధుతలై’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు వెట్రి. ఆయన గత ఏడాది సూర్యతో ‘‘వాడి వాసల్‌’ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ముందు ‘విధుతలై’ని పూర్తి చేసి తర్వాత కొత్త చిత్రాల పనిలో దిగనున్నారు వెట్రి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu