HomeTelugu Trendingసూర్యకి రోలెక్స్ వాచ్‌ బహుమతిగా ఇచ్చిన కమల్‌ హాసన్‌

సూర్యకి రోలెక్స్ వాచ్‌ బహుమతిగా ఇచ్చిన కమల్‌ హాసన్‌

 

Kamal Hassan Gift to Hero S

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన చిత్రం ‘విక్రమ్’. ఈ సినిమా లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి ఫహద్ ఫాసిల్ లు కూడా ప్రధాన పాత్రలలో నటించిన విషయం తెల్సిందే. ఈ ముగ్గురు స్టార్స్ మాత్రమే కాకుండా విక్రమ్ సినిమా లో తమిళ స్టార్ హీరో సూర్య రోలెక్స్ అనే అతిథి పాత్రలో నటించాడు.

ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ అయిన ‘శ్రేష్ఠ్ మూవీస్’ ద్వారా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేయడం జరిగింది. విడుదల అయిన అన్ని చోట్ల కూడా ‘విక్రమ్’ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.

విక్రమ్ విజయాన్ని పురస్కరించుకొని హీరో కమల్ హాసన్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరో సూర్యని ఆయన నివాసంలో కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే లోకేష్ కు అత్యంత ఖరీదైన కారును బహుమానంగా అందించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగానే కమల్ హాసన్ తన సొంత రోలెక్స్ వాచ్ ను సూర్య కి బహుమతిగా ఇచ్చారు. ఈ అరుదైన బహుమతి ని సూర్య తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ”ఇలాంటి క్షణమే జీవితాన్ని అందంగా మార్చుతుంది. థాంక్స్ అన్నా అంటూ ట్విట్టర్ లో ఆ ఫోటోలు మరియు బహుమతిగా తీసుకున్న వాచ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. విక్రమ్ సినిమా లో మూడు నాలుగు నిమిషాల పాటు సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించారు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ కి థియేటర్ దద్దరిల్లిపోయే మంచి స్పందన వచ్చింది. విక్రమ్ లో గెస్ట్ అప్పియరెన్స్ కు సూర్య పారితోషికం ఏమీ తీసుకోలేదట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!