HomeTelugu Big Storiesకంగనాకు కరోనా పాజిటివ్‌

కంగనాకు కరోనా పాజిటివ్‌

Kangana tests positive for

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌కు కరోనా సోకిందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఆమె ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ అండ్ టీజర్‌లు విడుదలయ్యాయి. అంతేకాదు మంచి ఆదరణ పొందాయి. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోన్న ఈ సినిమాను ఎ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పటికే రోజురోజుకు కేసులు ఎక్కువవుతుండడంతో.. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్‌ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ చిత్రాన్ని విడుదల చేయడం లేదనీ, వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాతలు విష్ణువర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ సహా జీ స్టూడియోస్‌ ఓ ప్రకటనలో తెలిపాయి. ఇక కంగనా ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ సినిమాతో పాటు కంగనా హిందీలో ‘తేజస్’, ’ధాకడ్’ అనే మరో రెండు సినిమాలను చేస్తోంది. ఇక కంగనా తాజాగా బెంగాల్ హింస విషయంలో కొన్ని ట్విట్స్ చేసింది. ఆ ట్వీట్స్ ట్విట్టర్ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని భావించిన ట్విట్టర్ టీమ్ ఆమె ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా బ్యాన్ చేసింది. గతంలో కూడా కంగనా పలు మార్లు వివాదస్పద ట్వీట్స్ చేసిన నేపథ్యంలో ట్విట్టర్ ఈ చర్యను తీసుకుంటున్నట్లు తెలిపింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu