రవితేజతో బాబీ సినిమా లేనట్లే!

గతంలో రవితేజ హీరోగా దర్శకుడు బాబీ ‘పవర్’ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో బాబీకు పవన్ కల్యాణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. కానీ ‘సర్ధార్’ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

దీంతో బాబీకు అవకాశాలు తగ్గిపోయాయి. ‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత రవితేజ కూడా మరో సినిమాను
పట్టాలెక్కించలేదు. రెండు, మూడు ప్రాజెక్ట్స్ అనుకున్నప్పటికీ మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తరువాత రవితేజ స్వయంగా బాబీను పిలిచి కథ చెప్పమని అడిగారు.

బాబీ చెప్పిన లైన్ నచ్చి కథ సిద్ధం చేసుకొని రమ్మని చెప్పాడట రవితేజ. తీరా బాబీ కథ రెడీ చేసుకొని వినిపిస్తే దానికి రవితేజ నో చెప్పినట్లు సమాచారం. రవితేజ చెప్పినట్లు కొన్ని మార్పులు, చేర్పులు చేసినప్పటికీ సంతృప్తి చెందలేదట. ఇక ఈ ప్రాజెక్ట్ ఇక్కడితోనే ఆపేయాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ తన తదుపరి సినిమా ఏ దర్శకుడితో చేస్తాడో.. చూడాలి!