HomeTelugu Trendingరణ్‌బీర్, దీపికపై విరుచుకుపడ్డ కంగన

రణ్‌బీర్, దీపికపై విరుచుకుపడ్డ కంగన

Kangana sensational comment

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ ఎవరినీ వదలకుండా సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఘాటు పెంచింది. ఇప్పటికే ఎంతోమందిని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా ఇప్పుడు రణ్‌బీర్ కపూర్, దీపిక పదుకొనే వంటి వాళ్లనూ వదలడం లేదు. రణ్‌బీర్ ఎప్పుడూ అమ్మాయిల మోజులో ఉంటాడని, ఆయనను రేపిస్ట్ అనే ధైర్యం ఎవరూ చేయరంటూ కామెంట్ చేసింది. మరోవైపు తనకు తాను పిచ్చిదని ప్రకటించుకున్న దీపికను కూడా స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమెను ఎవరూ ధైర్యం చేసి సైకో అనే సాహసం చేయరు అంటూ తీవ్ర విమర్శలు చేస్తోంది. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకు మాత్రం ఇష్టమొచ్చిన పేర్లు పెడుతుంటారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది కంగన. ఇండస్ట్రీలో ఇలాంటి భేదాలు సమసిపోయినప్పుడే మంచి జరుగుతుందని అప్పుడే టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు వస్తాయని అంటోంది కంగన.

Recent Articles English

Gallery

Recent Articles Telugu