Kanguva OTT release date:
సూర్య ప్రధాన పాత్రలో శిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన పాన్-ఇండియా చిత్రం ‘కంగువ’ నవంబర్ 14న భారీ అంచనాల మధ్య విడుదలైంది. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10,000కి పైగా థియేటర్లలో విడుదలయింది. అయితే ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రతిస్పందన మాత్రం పూర్తిగా నిరాశగా మారింది.
కథ, స్క్రీన్‌ప్లే పరంగా సినిమా అసలు బాగాలేదు అని కామెంట్స్ వినిపించాయి. విజువల్స్ మెప్పించగా, కథనం మాత్రం చాలా పాతదైనట్లు విమర్శలు వచ్చాయి. ఈ నెగెటివ్ టాక్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు పెద్దగా రాలేకపోయారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంది.
గతంలో సినిమాకు మంచి థియేట్రికల్ రన్ ఉండాలని భావించి, 8 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించిన చిత్రబృందం ఇప్పుడు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఓటీటీ విండోని 4 వారాలకు తగ్గించాలని భావిస్తోంది.
‘కంగువ’ కోసం ముందుగానే అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఓటీటీ డీల్ కుదుర్చుకున్నారు. అయితే థియేటర్లలో కలెక్షన్లు నిరాశ కలిగించడంతో ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది మల్టీప్లెక్స్‌లను దృష్టిలో ఉంచుకొని 8 వారాల విండో నిర్ణయించగా, ఇప్పుడు ఆ టైమ్‌లైన్‌ని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ‘కంగువ’ త్వరలోనే ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో, ఈ సినిమా థియేట్రికల్ పరాజయం ఓటీటీ పరంగా ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.