HomeTelugu Trendingకన్నడ నటుడు విజయ్‌ కన్నుమూత

కన్నడ నటుడు విజయ్‌ కన్నుమూత

Kannada actor sanchari vija
కన్నడ ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహిత సంచారి విజయ్‌ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. శనివారం అక్సిడెంట్‌కు గురైన ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం(జూన్‌ 14) ఆయన మృతి చెందారు. విజయ్‌ది బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు ధృవీకరించారని, తమ కుటుంబం ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించినట్లు విజయ్‌ సోదరుడు సిద్దేశ్‌ వెల్లడించారు. కాగా విజయ్‌ మృతి వార్తతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. స్టార్‌ హీరోలు సుదీప్‌, రాక్‌స్టార్‌ యశ్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu