‘సైరా’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌ ‘సైరా’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. చిత్రీకరణ కోసం కోకాపేటలో ప్రత్యేకమైన సెట్ వేశారు. ఈ సెట్లో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సెట్ పూర్తిగా కాలిపోయినట్టు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదం మూలంగా సుమారు 2 కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలో రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని చిరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్నారు.