HomeTelugu Newsటాలీవుడ్‌ హిట్‌ సీక్వెల్స్‌లో.. స్టార్‌ హీరో నిజమేనా?

టాలీవుడ్‌ హిట్‌ సీక్వెల్స్‌లో.. స్టార్‌ హీరో నిజమేనా?

Kannada star hero in jai ha

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలైన ‘హనుమాన్‌’ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. దీంతో ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’పైనే అందరి దృష్టి ఉంది.

కాగా ఇప్పటికే ఈ సినిమాలో రాముడిగా మహేష్‌ బాబు నటించనున్నాడు అనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. జైహనుమన్‌లో హనుమంతుడిగా కేజీఎఫ్ హీరో యష్ కనిపించనున్నట్లు టాక్‌. ఈ మొత్తం పూర్తిగా హనుమంతుని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దీంతో ఈ పాత్రని ఓ స్టార్ హీరో చేస్తారని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో ప్రశాంత్ వర్మ చెప్పాడు.

కాగా ఈ పాత్ర కోసం ఇప్పటికే పలు పేరు వినిపించాయి. ఇప్పుడు యష్ పేరు వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో యష్‌కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్‌తో యష్ చాలా పాపులర్ అయ్యాడు. దీంతో జై హనుమాన్‌లో యష్‌ను తీసుకోవాలని మూవీ టీమ్ అనుకుంటుందని తెలుస్తోంది.

దీంతో జై హనుమాన్ మూవీపై మరింత బజ్ క్రియేట్ అయింది.ఇప్పటి వరకూ యాక్షన్‌ హీరోగా కనిపించిన యష్‌ అటువంటి పాత్రలు సిద్దంగా లేడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం యశ్ తన అప్ కమింగ్ మూవీ టాక్సిక్‌పైనే ఉందని తెలుస్తోంది.

ఇక ‘జై హనుమాన్‌’లో తేజ సజ్జ హనుమంతుని భక్తుడైన హనుమంతుని పాత్రలోనే కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ కంటే చాలా ఎక్కువ బడ్జెట్, స్కేల్‌తో తీయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను ఇప్పటికే మొదలుపెట్టాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu