ప్రముఖ పాప్‌గాయని నాలుగో వివాహం!‌

ప్రముఖ పాప్‌గాయని జెన్నిఫర్‌ లోపేజ్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు. మాజీ బేస్‌బాల్‌ క్రీడాకారుడు అలెక్స్‌ రాడ్రిగేజ్‌తో ఇటీవల జెన్నిఫర్ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని వీరిద్దరూ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటిస్తూ.. అలెక్స్‌.. లోపేజ్‌ చేతికి తొడిగిన వజ్రపు ఉంగరం ఫొటోను పోస్ట్‌ చేశారు. అలెక్స్‌ కంటే లోపేజ్‌‌ ఆరేళ్లు పెద్ద. రెండేళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. అదీకాకుండా లోపేజ్‌కు ఇదివరకే మూడుసార్లు వివాహమైంది. 11 ఏళ్ల కవల పిల్లలకు తల్లి కూడా. అలెక్స్‌ కూడా వివాహితుడే. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates