HomeTelugu Trending'కన్నప్ప' ఫస్ట్‌లుక్‌ విడుదల

‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌ విడుదల

kannappa movie first look r
manchu vishnu: మంచు విష్ణు డ్రీమ్‌ ప్రోజెక్ట్‌ కన్నప్ప నుంచి తాజాగా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ రోజు మంచు విష్ణు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో హీరో ముఖం చూపించ‌కుండా శివ‌లింగ‌ంపై ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టిన‌ట్లుగా ఈ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు.

ఓ నాస్తికుడు శివుడికి ప‌ర‌మ‌భ‌క్తుడిగా ఎలా మారాడ‌ద‌న్న‌ది క‌న్న‌ప్ప సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు మంచు విష్ణు తెలిపాడు. పాన్ ఇండియ‌న్ స్థాయిలో క‌న్న‌ప్ప మూవీ తెర‌కెక్కిస్తున్నాడు మంచు విష్ణు. ఈ సినిమాలో పాన్‌ ఇండియా హీరో ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్, శివ‌రాజ్‌కుమార్ లాంటి స్టార్‌ హీరోలు గెస్ట్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్నారు.

మోహ‌న్‌బాబు కూడా కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. క‌న్న‌ప్ప మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌లో జ‌రుగుతోంది. క‌న్న‌ప్ప మూవీకి మంచు విష్ణు ర‌చ‌యిత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. చాలా రోజుల క్రిత‌మే ఈ సినిమాను అనౌన్స్‌చేశారు.

ఇటీవ‌ల షూటింగ్ మొద‌లుపెట్టారు. క‌న్న‌ప్ప మూవీని మోహ‌న్‌బాబు నిర్మిస్తున్నాడు. మైథ‌లాజిక‌ల్ మూవీకి మ‌హాభ‌ర‌త్ సీరియ‌ల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ఈ సినిమా తెలుగు, హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో విడుదలౌతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu