HomeTelugu Trendingఆస్కార్‌ బరిలో కాంతార

ఆస్కార్‌ బరిలో కాంతార

kantara movie qualifies for

చిన్న సినిమాగా విడుదలన కాంతార మూవీ సంచలన విజయంతో రికార్డులు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ ఏడాది రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయింది. హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తొలుత కన్నడలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఆపై తెలుగు సహా పలు భాషల్లోనూ ఈ సినిమాను నిర్మాతలు విడుదల చేశారు. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందీ సినిమా. తాజాగా ఆస్కార్ బరిలో నిలిచి మరో ఘనత సాధించింది.

కాంతార సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిందని సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. రెండు విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ మూవీ అవార్డు విభాగంతో పాటు బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేట్ అయిందని తెలిపింది. కన్నడిగుల సంప్రదాయ భూతకోల నేపథ్యంలో దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆయన హీరోగానూ నటించారు. క్లైమాక్స్ లో చివరి 20 నిమిషాలపాటు ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాగా, కాంతార సినిమాకు సీక్వెల్ తీస్తామని గతంలోనే ప్రకటించిన హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి.. ప్రస్తుతం షూటింగ్ ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!