HomeTelugu Trendingఇస్మార్ట్ 'రెడ్‌'

ఇస్మార్ట్ ‘రెడ్‌’

7 19ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. ఇస్మార్ట్ శంఖర్‌ సినిమాతో ఇండస్ట్రీలో హిట్ కొట్టాడు. మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. సాలిడ్ గా మంచి విజయం సాధించి రామ్ కు చాలాకాలం అయ్యింది. రామ్ కోరికను పూరి ఇస్మార్ట్ శంకర్ తో సినిమా తీర్చారు. ఈ సినిమా తరువాత రామ్ ఏ సినిమా చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో కలిగింది. అయితే, తమిళంలో సూపర్ హిట్టైన తడం సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. స్రవంతి మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ 18 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు రెడ్ అనే టైటిల్ ను పెట్టారు. అంతేకాదు, రామ్ కు సంబంధించిన లుక్ ను కూడా విడుదల చేశారు. రామ్ మేకప్ లేకుండా బ్లాక్ కలర్లో గడ్డం పెంచి ఉన్నాడు. టైటిల్ రెడ్.. కలర్ బ్లాక్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu