HomeTelugu Newsబాలీవుడ్‌కు 'డియర్‌ కామ్రేడ్‌'

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

11 15బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాను హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా ఇది. భరత్‌ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. జులై 26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.

కాగా ‘డియర్‌ కామ్రేడ్‌’ హిందీ రీమేక్‌ హక్కుల్ని కరణ్‌ సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సినిమాను చూసిన ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది అద్భుతమైన, పవర్‌ఫుల్‌ ప్రేమకథ. భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ చక్కటి సంగీతం అందించారు. నటీనటుల నటన అత్యుత్తమంగా ఉంది. విజయ్‌ దేవరకొండ బ్రిలియంట్‌, రష్మిక బాగా నటించారు. ఈ అందమైన ప్రేమకథను ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థ రీమేక్‌ చేయబోతోంది’ అని ట్వీట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu