అంబానీ విందులో వడ్డించాండంపై అభిషేక్‌ వివరణ

డిసెంబర్ 12న జరిగిన ఈశా అంబానీ ఆనంద్‌ పిరామల్‌ల పెళ్లి వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖులు మొత్తం హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ లు అతిథులకు భోజనాలు వడ్డిస్తూ కనిపించారు. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంత మంది పనివాళ్లు ఉన్నప్పుడు సెలబ్రిటీలు ఎందుకు భోజనాలు వడ్డించారు? అంటూ నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు.

దీనిపై తాజాగా అభిషేక్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ఇలా భోజనాలు వడ్డించే సంప్రదాయాన్ని ‘సజ్జన్‌ ఘోట్’ అంటారు. వధువు తరఫు కుటుంబీకులు వరుడి తరఫు వారికి భోజనాలు వడ్డిస్తారు’ అని సమాధానమిచ్చారు.