HomeTelugu Trendingకార్తి 'ఖైదీ' అప్డేట్‌

కార్తి ‘ఖైదీ’ అప్డేట్‌

Karthi Khaidi Producer clar

కోలీవుడ్‌ హీరో కార్తి కెరియర్లో ‘ఖైదీ’ స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. ఎస్.ఆర్. ప్రభు నిర్మాణంలో .. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చింది ఈ సినిమా. ఒక పోలీస్ స్టేషన్ సెట్ .. ఒక అనాథ బాలికల హాస్టల్ సెట్ .. సింగిల్ కాస్ట్యూమ్ లో హీరో. ఇంత తక్కువ బడ్జెట్ లో లోకేశ్ కనగరాజ్ చిత్రీకరించిన ఈ సినిమా, తమిళంలోనే కాదు ఇతర భాషల్లోనూ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. హీరోయిన్, రొమాంటిక్ పాటలు, కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఇటీవల ఒక వేదికపై కార్తి చెప్పాడు కూడా. అయితే ఆ తరువాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఉండదనే అంతా అనుకున్నారు. కానీ తాజాగా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు మాట్లాడుతూ, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశాడు. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నాడు. ప్రస్తుతం ‘సర్దార్’ సినిమా చేస్తున్న కార్తి, ఆ తరువాత ‘ఖైదీ’ సీక్వెల్‌ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu