HomeTelugu Trendingనాని సినిమా జెర్సీతో పాటు కార్తి ఖైదీ..

నాని సినిమా జెర్సీతో పాటు కార్తి ఖైదీ..

Karthi khaidi movie selecte
నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ మూవీ గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. క్రికెట్ పట్ల ఓ ఆటగాడికి ఉన్న ఆసక్తిని హృద్యమైన రీతిలో భావోద్వేగభరితంగా చూపించిన చిత్రం. అయితే ఈ సినిమా ఇప్పుడు మరో ఘనతను సాధించింది. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు సెలెక్ట్‌ అయ్యింది. కెనడాలో జరిగే ఈ వేడుక జరగనుంది. నాని సినిమాతో పాటు హీరో కార్తి ఖైదీ సినిమా కూడా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. బిడ్డను చూడాలనే ఆశతో జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ జీవితంలో జరిగే ఒక్క రాత్రి సంఘటనలతో ఈ సినిమా రూపొందింది. హీరోయిన్‌ లేని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. పూర్తిగా థ్రిల్లింగ్‌ అంశాలతో సాగే ఈ సినిమా గతేడాది దీపావళి సందర్బంగా విడుదలై ఘన విజయం సాధించింది. కమర్షియల్‌గా భారీ కలెక్షన్లని కూడా రాబట్టింది. బాలీవుడ్‌ నుంచి హృతిక్‌ రోషన్‌ నటించిన `సూపర్‌ 30` ఎంపిక కావడం
విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu