HomeTelugu Trendingకార్తికేయ-2 మోషన్‌ పోస్టర్‌ విడుదల

కార్తికేయ-2 మోషన్‌ పోస్టర్‌ విడుదల

Karthikeya 2 movie Motion P

చందూ మొండేటి కొంతకాలం క్రితం తెరకెక్కించిన ‘కార్తికేయ’ మూవీ భారీ విజయాన్ని సాధించింది. నిఖిల్ హీరోగా నటించిన ఆ సినిమా.. సుబ్రహ్మణ్యస్వామి ఆలయ రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా ‘కార్తికేయ- 2’ రూపొందింది. వివేక్ కూచిభొట్ల .. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.

ఈ కథ ద్వాపర యుగానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుందని ముందుగానే చెప్పారు. తాజాగా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. “సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం ద్వారకా నగరం” అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను వదిలారు.

సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారకలో దాగిన రహస్యాన్ని తెలుసుకోవడానికి అనుపమతో కలిసి నిఖిల్ బయల్దేరినట్టుగా ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది. కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో జూలై 22వ తేదీన విడుదల చేయనున్నారు.
https://www.instagram.com/p/CeP25RXDkwZ/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu