HomeTelugu Trendingఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని డిలీట్‌ చేసిన మెగా డాటర్‌

ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని డిలీట్‌ చేసిన మెగా డాటర్‌

Niharika konidela deleted h
మెగా డాటర్‌ నిహారిక కొణిదెల గుర్తించి పరిచయం ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయినా వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2020, డిసెంబర్‌9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తుంది.

ఇటీవలే ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించి ప్రొడ్యూసర్‌గానూ అవతరించింది. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ, తన సినిమా విశేషాలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్‌ చేసుకునేది. కానీ అనూహ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని డిలీట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే నిహారికి సడెన్‌గా అకౌంట్‌ డిలీట్‌ చేయడం ఏంటని నెటిజన్లు ఆరా తీశారు.

అయితే తాజాగా జిమ్‌లో నిహారిక షేర్‌ చేసిన ఓ వీడియోపై ట్రోల్స్‌ రావడంతో అకౌంట్‌ డిలీట్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అకౌంట్‌ తొలగించడానికి ఇదే కారణమా లేక మరేదైన కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu