HomeTelugu Trending'కార్తికేయ‌ 2' కొత్త రిలీజ్‌ డేట్‌.. ప్రకటన

‘కార్తికేయ‌ 2’ కొత్త రిలీజ్‌ డేట్‌.. ప్రకటన

Karthikeya 2 new release da
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ న‌టిస్తోన్న చిత్రం ‘కార్తికేయ‌ 2’. కేర‌ళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. చందూ మొండేటి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈసినిమా ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఆగ‌స్టు12న విడుద‌ల‌కావాల్సి ఉంది. కాగా మేక‌ర్స్ నేడు కొత్త విడుదల తేదీని ప్ర‌క‌టించారు. తాజాగా ఒక రోజు ముందుకు జ‌రిపి ఆగ‌స్టు 13న రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

నిఖిల్ అండ్ మూవీయూనిట్ ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. కార్తికేయ‌ 2 సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. కార్తికేయ 2లో శ్రీనివాస్ రెడ్డి, బాలీవుడ్ యాక్ట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్‌ అనుపమ్‌ఖేర్, ఆదిత్యా మీన‌న్‌, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కార్తికేయ 2కు కాలభైరవ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu