HomeTelugu Trendingమెస్మరైజింగ్ గెటప్‌లలో కత్రినా కైఫ్

మెస్మరైజింగ్ గెటప్‌లలో కత్రినా కైఫ్

Katrina Kaif Tiger 3 movie 1

బాలీవుడ్‌లో హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది కత్రీనా కైఫ్. నేటి తరం కుర్రకారు హృద‌యాల‌ను గిలిగింత‌లు పెట్టే హీరోయిన్స్‌లో కత్రీనా కైఫ్ ఒకరు. కత్రినా గ్లామర్, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. బాలీవుడ్ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘టైగర్ 3’లో జోయా అనే పాత్ర‌లో కత్రినా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

టైగర్ 3 సినిమా నుంచి అక్టోబ‌ర్ 23న ‘లేకే ప్రభు కా నామ్’ సాంగ్ విడుదల కానుంది. ఈ పాట‌లో క‌త్రినా కైఫ్ ఏకంగా 7 అద్భుత‌మైన లుక్స్‌తో అలరించనుంది. ఆమె కెరీర్‌లోనే ఈ సాంగ్ వ‌న్ ఆఫ్ ది మోస్ట్ ఫేవ‌రేట్‌గా నిలవనుంది. క‌త్రినా మాట్లాడుతూ ‘లేకే ప్రభు కా నామ్’ సాంగ్ విజువ‌ల్‌గా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది. అందుకే నా ఫేవ‌రేట్ సాంగ్స్‌లో ఇదొక‌టి అని చెప్పింది.

Katrina Kaif Tiger 3 1

“ట‌ర్కీలోని కాప్ప‌డోసియా ప్రాంతంలో ఈ పాట‌ను చిత్రీక‌రించారు. మాషాల్లా, స్వాగ్ సే స్వాగ‌త్ పాట‌ల త‌ర్వాత‌ నా ఫేవ‌రేట్ కొరియోగ్రాఫ‌ర్ వైభ‌వి మ‌ర్చంట్‌తో క‌లిసి ప‌ని చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. అనితా ష్రాఫ్ అజానియా ఈ పాట‌లో న‌న్ను ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ పాట‌లో న‌న్ను ఏకంగా ఏడు మెస్మ‌రైజింగ్ లుక్స్‌లో చూపించారు. దేనిక‌దే ప్ర‌త్యేకంగా నిలుస్తుందని చెప్పింది. లేకే ప్ర‌భు కా నామ్ పాట‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాను” అని కత్రీనా తెలిపింది.

“వైభ‌వి పాట‌ను చిత్రీక‌రించిన తీరు.. టైగ‌ర్‌, జోయా మ‌ధ్య ఉండే కెమిస్ట్రీ స‌రికొత్త‌గా అల‌రించ‌నుంది. స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి డాన్స్ చేయ‌టాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఈ పాట చిత్రీక‌ర‌ణ‌లో మ‌రిచిపోలేని అనుభూతులెన్నో ఉన్నాయి అంది. మనీష్ శర్మ దర్శకత్వంలో వస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu