HomeTelugu Newsరామ్‌ చరణ్‌ సినిమాలో కౌశల్‌!

రామ్‌ చరణ్‌ సినిమాలో కౌశల్‌!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్’. ప్రముఖ బుల్లితెర నటుడు కౌశల్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసేసింది. ‘బిగ్‌బాస్’ విజేతగా నిలిచిన కౌశల్‌కు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయట. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కైరా అద్వాణి హీరోయిన్‌గా నటిస్తుంది.

7 1

ఈ చిత్రంలో కౌశల్ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. ‌బిగ్‌బాస్‌ ట్రోఫీ దక్కించుకున్న కౌశల్‌కు ఎందరో సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌చరణ్‌ చిత్రంలో ప్రముఖ నటుడు ఆర్యన్‌ రాజేశ్‌ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ యూరప్‌లోని అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఈ చిత్రానికి తన తండ్రి చిరంజీవి నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘స్టేట్‌ రౌడీ’ పేరును టైటిల్‌గా పరిశీలిస్తున్నారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu