HomeTelugu News'ఉద్యమ సింహం' ఫస్ట్‌ లుక్‌

‘ఉద్యమ సింహం’ ఫస్ట్‌ లుక్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన విషయాల గురించి ఈ సినిమా ఉండబోతున్నది. ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో సీనియర్ నటుడు నాజర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. కేసీఆర్ గెటప్ లో నాజర్ సరిగ్గా సరిపోయారు.

2 12

ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్నది. నవంబర్ 16 వ తేదీన ఉద్యమ సింహం పాటలు రిలీజ్ కానున్నాయి. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. సినిమా గురించిన మిగతా వివరాలను ఆడియో వేడుక సమయంలో తెలియజేస్తారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu