అరవింద సమేతలో ఎన్టీఆర్‌ గురువు..?

తెలుగు సినిమాల్లో గురువుగారు అంటూ.. కామెడీ చేసే సినిమాలు చాలానే ఉన్నయి. వెంకీ సినిమాలో రవితేజ, మల్లిఖార్జున్. అదుర్స్ లో ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ ఈ కోవకు చెందినదే. ఈ చిత్రాలు అన్ని సూపర్‌ హిట్‌ అయినవే. ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవలో కూడా ఇలాంటి గురు శిష్య కామెడీని పండించబోతున్నారట. ఇంతకీ గురువు ఎవరు..శిష్యుడు ఎవరు.. గురువు గారి పాత్రలో సునీల్, శిష్యుడి పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారట.

ఈ సినిమాలో 90% సీన్స్ లో సునీల్ ఉండనున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ కోసం మంచి కామెడీని సృష్టించినట్టు తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్, సునీల్ ల మధ్య వచ్చే గురు శిష్య కామెడీ సినిమాకు హైలైట్ గా నిలవనుందని చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. మరి ఇద్దరి మధ్య అదుర్స్ లాంటి కామెడీ ఉంటుందో చూడాలి. కాగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.