రేపు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. ఈ మేరకు పార్టీ తరఫున గెలుపొందిన 88 మంది ఎమ్మేల్యేలతో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది.. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశంలో చేసిన తీర్మానాన్ని సమర్పించనున్నారు.

గురువారం మధ్యాహ్నం 1.30కు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా లేదా మరికొంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. నలుగురు మంత్రులు ఓడిపోయినందున, వీరి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసుకోవడంతోపాటు ప్రస్తుతం ఉన్న వారిలో కొందరిని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

CLICK HERE!! For the aha Latest Updates