అన్నదమ్ములతో ఒకేసారి!

ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పేరు ఇండస్ట్రీలో తెగ వినిపిస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ.. సక్సెస్ ఫుల్  హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించేందుకు రెడీ అవుతోన్న  ఈ భామ త్వరలోనే సూర్యతో జత కట్టడానికి కూడా సిద్ధమైపోతుంది. అయితే ఇప్పుడు తాజాగా సూర్య తమ్ముడు కార్తీతో కూడా రొమాన్స్  చేయనుందని సమాచారం.

గతంలో తమన్నా ఇలానే వరుసగా సూర్యతో అయన్ సినిమాలో నటించి, వెంటనే తన తమ్ముడు కార్తీతో ఫైయా అనే సినిమాలో మెరిసింది.  ఇప్పుడు కీర్తి సురేష్ వంతు వచ్చింది. కాష్మోరా సినిమా తరువాత మణిరత్నం సినిమాతో పాటు కార్తీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ  సినిమాను దర్శకుడు వినోద్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాలో కార్తికి జంటగా కీర్తిని తీసుకోవాలని సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె  కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.