నయనతారకు లోకల్‌ అబ్బాయిలు అస్సలు నచ్చరంట.. ‘మిస్టర్‌ లోకల్‌’ టీజర్‌

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార.. ‘నీలాంటి లోకల్‌ అబ్బాయిలు నాకు అస్సలు నచ్చరు’ అని అంటూ సినీ నటుడు శివ కార్తికేయన్‌పై మండిపడుతున్నారు. వీరిద్దరూ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ లోకల్‌’. ఎం. రాజేశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈరోజు శివకార్తికేయన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ‘నా పేరు మనోహర్‌. నన్ను అందరూ మిస్టర్‌ లోకల్‌ అని పిలుస్తుంటారు’ అంటూ కార్తికేయన్‌ ఫైటింగ్‌ చేస్తూ చెబుతున్న డైలాగులతో టీజర్‌ మొదలైంది.

తొలిచూపులోనే కీర్తన వాసుదేవన్‌ (నయనతార)ను చూసి ఇష్టపడతాడు. ఆమె వెంటపడుతుంటాడు. ‘నేనెవరో తెలుసా. కేవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీఈవో కీర్తన వాసుదేవన్‌. నాకు నీలాంటి లోకల్‌ అబ్బాయిలు అస్సలు నచ్చరు’ అంటూ కార్తికేయన్‌ను నయన్‌ కసురుకోవడం ఫన్నీగా ఉంది. హిప్‌హాప్‌ తమిళ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శివ కార్తికేయన్, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రిమది. వీరిద్దరూ ‘వెలైక్కారన్‌’ చిత్రంలో జంటగా నటించారు. మే 1న ‘మిస్టర్‌ లోకల్‌’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates