HomeTelugu Big Stories'ధూమ్ ధామ్' డాన్స్‌ చేసిన కీర్తిసురేష్‌

‘ధూమ్ ధామ్’ డాన్స్‌ చేసిన కీర్తిసురేష్‌

Keerthy suresh dhoom dhaam
న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం ‘ద‌స‌రా’. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ సినిమా నుంచి విడుద‌లైన మాస్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. కీర్తిసురేశ్ లుంగీ క‌ట్టుకొని డ్యాన్స్ పార్ట్‌నర్‌లతో క‌లిసి స్టైలిష్ బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని ఈ పాట‌కు మాస్‌ స్టైప్స్‌ వేసింది.

శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తెలుగుతోపాటు వివిధ భాష‌ల్లో విడుద‌లవుతున్న ఈ మూవీలో సాయికుమార్, స‌ముద్ర‌ఖ‌ని, జ‌రీనా వ‌హ‌బ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

తెలంగాణ యాస‌లో ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైనర్‌గా తెర‌కెక్కుతున్న ద‌స‌రా చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న‌ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu