హాట్‌ హాట్‌గా రెడీ రెడీ అంటున్న మిల్కీ బ్యూటీ..!


మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటించిన అభినేత్రి 2 చిత్రాన్ని అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని రెడీ రెడీ.. అనే పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటలో తమన్నా చిందులేస్తూ.. ప్రభుదేవాను ఆటపట్టిస్తూ కనిపించింది. 2016లో వచ్చిన అభినేత్రి సినిమాకు సీక్వెల్‌ ఇది. ఈ సారి సినిమాలో ప్రభుదేవాను రెండు దెయ్యాలు పీడించబోతున్నాయి. ఇంకా నందితా శ్వేత, కోవై సరళ, సప్తగిరి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను మే 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో దేవి 2 టైటిల్‌తో విడుదల చేయనున్నారు.

అభినేత్రి-2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం విడుదల చేసిన తమన్నా హాట్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వానపాటలు, స్విమ్మింగ్ ఫూల్ సీన్లలో గతంలో గ్లామర్ డోసు పెంచి నటించిన తమన్నా ఇపుడు ‘అభినేత్రి 2’లో సైతం తన అందాల ఆరబోతతో అభిమానులకు మంచి కిక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.