ప్రీరిలీజ్ ఫంక్షన్ గెస్ట్ అతడే!

పవన్ కల్యాణ్ నటిస్తోన్న కాటమరాయుడు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఈరోజు సాయంత్రం జరగనుంది.ఈ వేడుకకు అతిథిగా ఎవరు రాబోతున్నారనే విషయంలో చాలా పేర్లు వినిపించాయి. కానీ పవన్ నుండి ఎవరికి కూడా ఈ వేడుకకు రమ్మని ఆహ్వానాలు అందలేదట. దానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. పవన్ అభిమానులకు వేదికపై పవన్ ఉంటే చాలు.. ఇంకెవరూ అక్కర్లేదు.

ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే ఎవరిని ఆహ్వానించలేదని తెలుస్త్జోంది. పవన్ స్నేహితులు త్రివిక్రమ్, అలీ వంటి వారు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు. పవన్ ఇండస్ట్రీ కు వచ్చి ఇరవై ఏళ్ళు పూర్తయింది. ఈ సంధర్భంగా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పవన్ అభిమానులు ఆయనని ఘనంగా సత్కరించాలని ప్లాన్ చేస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే ఈ వేడుక ప్రారంభం కానుంది.