HomeTelugu Trendingకన్నడ సూపర్ స్టార్‌ తో తమన్నా!

కన్నడ సూపర్ స్టార్‌ తో తమన్నా!

2 1

మిల్కీ బ్యూటీ తమన్నా కెరియర్ ఈ మధ్య కాస్తా డల్‌ అయింది. అయితే ఒక పెద్ద సినిమా పడితే మళ్లీ తన కెరియర్ ఊపందుకుంటుందనే ఆశతో వుంది అమ్మడు. ఇక ఇప్పుడు అలాంటి ఓ ఆఫర్ ఆమె తలుపు తట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏకంగా ‘కేజీఎఫ్’ హీరో సరసన ఆమెకి అవకాశం వచ్చిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ప్రస్తుతం యశ్ .. ‘కేజీఎఫ్ 2’ చేస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లానింగ్‌లో వున్నారు. ఆ తరువాత నార్తన్ దర్శకత్వంలో యశ్ ఒక కన్నడ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. అయితే ఆ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది తాజా సమాచారం. కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేస్తారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu