HomeTelugu Trending'రూల్స్‌ రంజన్‌' ఫస్ట్‌లుక్‌

‘రూల్స్‌ రంజన్‌’ ఫస్ట్‌లుక్‌

Kiran abbavaram rules ranja

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాడు. తాజాగా ‘రూల్స్‌ రంజన్‌’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకున్నాడు. రత్నం కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి కిరణ్ అబ్బవరం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఆయన బర్త్‌డే సందర్భంగా శుక్రవారం (జులై 15) విడుదల చేశారు. బిజినెస్‌ మ్యాన్‌ సూట్‌లో చాలా డిఫరెంట్‌గా కనువిందు చేశాడు కిరణ్‌ అబ్బవరం.

ఏ.ఎం రత్నం సమర్పణలో శ్రీ సాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఏంటర్ టైన్మెంట్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ‘డి.జె.టిల్లు’ ఫేం నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. వెన్నెల కిషోర్,హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అన్ను కపూర్ (బాలీవుడ్), సిద్ధార్థ సేన్ (బాలీవుడ్), అతుల్ పర్చురే (బాలీవుడ్), ఆశిష్ విద్యార్థి, అజయ్ వంటి పలువురు స్టార్స్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దివ్యాంగ్ లవానియా, వి.మురళీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu