HomeTelugu Trendingమరో కొత్త సినిమా ప్రకటించిన 'కేజీఎఫ్‌' డైరెక్టర్‌

మరో కొత్త సినిమా ప్రకటించిన ‘కేజీఎఫ్‌’ డైరెక్టర్‌

KGF director Prashanth Ne

డైరెక్టన్‌ ప్రశాంత్‌ నీల్‌ ‘కేజీఎఫ్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. కాగా ఇప్పటికే ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ అనే సినిమాను ప్రకటించాడు. తాజాగా మరోసినిమా కూడా ప్రకటించాడు‌. కన్నడ స్టార్ హీరో శ్రీమురళి తో ఓ సినిమా చేస్తున్నట్లు బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. అంతేకాదు.. సినిమాకు ‘బఘీరా’ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాకు ప్రశాంత్‌నీల్‌ కథ అందిస్తుండగా.. డాక్టర్‌ సూరి దర్శకత్వం వహించనున్నారు. హీరో శ్రీమురళి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. హంబలే సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మించనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu