తమన్నాను భయపెడుతున్న ప్రభుదేవా.. దడ పుట్టిస్తోన్న ‘ఖామోషీ’ టీజర్‌

ప్రభుదేవా, తమన్నా, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఖామోషీ’. చక్రి తోలేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీవైఎక్స్‌ సంస్థ నిర్మిస్తోంది. సమీర్‌ టాండన్‌, సత్య మానిక్‌ అఫ్సర్‌ సంగీతం అందిస్తున్నారు. సంజయ్‌ సూరి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ అతిథిగా కనిపించనున్నారట. 2017లోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

చివరికి ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. తమన్నా బధిర యువతిగా కనిపించారు. ప్రభుదేవా విలన్‌గా తన హావభావాలతో దడ పుట్టించారు. ఆయన ఇందులో సైకో పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ‘జాగ్రత్తగా ఉండండి.. ఒక్కసారి అతడికి చిక్కితే.. వదిలిపెట్టడు’ అంటూ టీజర్‌లో చూపించారు. మే 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates