గాలికి పైకి ఎగిరిన కియారా డ్రైస్‌.. అలర్ట్‌ అయిన బ్యూటీ

కియారా అద్వానీ టాప్ హీరోయిన్ గా ఎదగడానికి కావాల్సిన అన్ని క్వాలిటీలు ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లోను టాప్ హీరోలతో సినిమాలు చేసింది. మరికొన్ని లైన్లో ఉన్నాయని చెప్పొచ్చు. మహేష్ తో భరత్ అనే నేను, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చేసింది. అటు బాలీవుడ్ లోను టాప్ స్థాయిలో దూసుకుపోతున్నది.

ఆమె చేసిన లస్ట్ స్టోరీస్ సినిమా యూత్ పై ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కియారా హైట్, వెయిట్ దానికి తగ్గట్టుగా అందం… అన్ని ఆమెలో పుష్కలంగా ఉన్నాయి. ఎప్పుడు బయటకు వచ్చినా అల్ట్రా మోడ్రన్ డ్రెస్ తో అదరహో అనిపిస్తుంది. రీసెంట్ గా ముంబైలో ఓ వేడుకకు హారమయ్యేందుకు వచ్చింది. బ్లూ కలర్ లాంగ్ షర్ట్ లో మెరుపులు మెరిపించింది. ముందు మోకాళ్ళకు పైన, వెనుక పొడవుగా ఉన్న ఈ షర్ట్ చూసేందుకు గొడుగులా ఉంటుంది. మెట్లు ఎక్కుతూ… మీడియాకు హాయ్ చెప్పింది. మరలా వెనక్కి తిరిగి హాయ్ అన్నది. ఈలోపు ఎక్కడి నుంచో జివ్వుమని కొండగాలి.. కస్సుమని నిన్ను చేరి… అనే టైప్ లో వీచింది. ఇంకేముంది ఆ గాలికి కియారా షర్ట్ పైకి లేచింది. ఈలోగా అలర్టైన కియారా చేత్తో షర్ట్ ను పట్టుకొని తుర్రుమని లోనికి వెళ్ళిపోయింది. లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో.