HomeTelugu Trendingచెర్రీ సినిమా కోసం భారీగా డిమాండ్‌ చేసిన కియారా!

చెర్రీ సినిమా కోసం భారీగా డిమాండ్‌ చేసిన కియారా!

kiara advani remuneration f

బాలీవుడ్‌ నటి కియారా అద్వాణీ వరుస సినిమాలతో బీజీగా ఉంది. టాలీవుడ్‌లో మహేశ్‌ నటించిన ‘భరత్‌ అనే నేను’ సినిమా తో పరిచయమై.. తెలుగులోనూ ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. శంకర్‌-రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఎంపికయ్యారు. ఈ సినిమాలో నటించడానికి ఆమె పారితోషికం భారీగానే తీసుకుంటున్నారట. సాధారణంగా తీసుకునే రూ.4 కోట్ల రెమ్యూనరేషన్‌ కంటే కూడా రూ.కోటి ఎక్కువగా డిమాండ్‌ చేశారట ఈ బాలీవుడ్‌ బ్యూటీ. మొత్తంగా రూ.5 కోట్లు కోరగా.. రూ.నాలుగు కోట్ల యాభై లక్షలకి మూవీ యూనిట్‌ ఒప్పించిందట. దీంతో ఒక్క సినిమాకి కియారా ఎంత సంపాదిస్తుందో తెలుసా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

రామ్‌చరణ్‌ 15వ చిత్రంగా శంకర్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చెర్రీ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారు. తమన్‌ సంగీతం అందించనున్నారు. ఇందులో మరో స్టార్‌ హీరో కూడా నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu