రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది:కాజల్


టాలీవుడ్ కాజల్ అగర్వాల్ గత పదేళ్లుగా టాప్ స్థాయిలో దూసుకుపోతున్నది. సినిమా అవకాశాలు తగ్గిపోతున్నాయి అనుకుంటున్న సమయంలో ఓ పెద్ద హిట్ కొట్టి అవకాశాలు దక్కించుకుంటోంది. మెగాస్టార్ నుంచి కుర్ర హీరోల వరకు అందరితోనూ నటించింది. ఒకరకంగా చెప్పాలంటే ఇదీ ఒక రికార్డే. మాములుగా సినిమా వాళ్లకు రాజకీయాలకు, క్రికెట్ కు అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో నటించే వ్యక్తులు రాజకీయాల్లోకి వెళ్తుంటారు… క్రికెట్ వాళ్ళను అభిమానిస్తుంటారు. అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు.

కాజల్ కు రోహిత్ శర్మ బ్యాటింగ్ అంటే ఇష్టమని చాలాసార్లు చెప్పింది. రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే ఎంతసేపైనా అలా చూస్తుండి పోవాలి అనిపిస్తుందట. రోహిత్ ను పొగడ్తలతో ముంచెత్తిన కాజల్ ను చూస్తుంటే రోహిత్ అంటే పిచ్చి ప్రేమ ఉన్నట్టుగానే ఉంది. కానీ ఏం లాభం.. రోహిత్ కు పెళ్లయింది. రీసెంట్ గా పాప కూడా పుట్టింది. సినిమాల నుంచి రిటైర్ అయ్యాక పెళ్లి చేసుకొని సెటిల్ అవుతా అంటోంది కాజల్. మరి ఎవర్ని చేసుకుంటుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి.