HomeTelugu Trendingబన్నీ సినిమాలో కైరా అద్వానీ ఐటమ్‌ సాంగ్‌..

బన్నీ సినిమాలో కైరా అద్వానీ ఐటమ్‌ సాంగ్‌..

10 10

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. స్మగ్లింగ్ చేసే బృందంలోని వ్యక్తిగా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మికను తీసుకున్నారు.

సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ అంటే ఓ రెంజ్‌లో ఉంటుంది. అందునా ఈ కథ అడవి నేపథ్యంలో సాగేది కావడంతో, ఆ స్థాయిలోనే ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశాడట. ఈ సాంగ్ కోసం కైరా అద్వానీని సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. కైరా అద్వానీ ఒప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకుముందు కైరా అద్వాని .. చరణ్ జోడీగా ‘వినయ విధేయ రామ’ నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu