HomeTelugu Trendingమీడియాకి కిచ్చా సుదీప్‌ క్షమాపణలు

మీడియాకి కిచ్చా సుదీప్‌ క్షమాపణలు

kiccha
కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటించిన తాజా మూవీ విక్రాంత్‌ రోణ ఈ నెల 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. అనూప్ బండారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా విడుదలకు భారీ సన్నాహాలు చేశారు. ప్రమోషన్స్‌ భాగంగా.. ఈ రోజు (జులై21)న హైదరాబాద్‌, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్‌ నిర్వహించాల్సి ఉంది.

అయితే ఇప్పుడు ఆ మీటింగ్స్‌ క్యాన్సిల్‌ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా ప్రతినిథులకు కిచ్చా సుదీప్‌ క్షమాపణలు చెప్పారు. అనారోగ్య కారణాలతో ప్రెస్‌మీట్లకు హాజరు కాలేకపోతున్నానని, తనను క్షమించాలని కోరారు. పూర్తిగా కోలుకున్న వెంటనే త్వరలోనే అందరినీ కలుస్తాను అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu