HomeTelugu Trendingమనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో సమంత

మనోజ్‌ బాజ్‌పేయీ వెబ్‌సిరీస్‌లో సమంత

9 25బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పేయీ నటించిన వెబ్‌సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’. మధ్య తరగతికి చెందిన ఓ వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థకు ఏజెంట్‌గా పనిచేస్తాడు. సెప్టెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో ప్రియమణి, నీరజ్‌ మాధవ్‌, పవన్‌ చోప్రా, కిషోర్‌ కుమార్‌ కీలకపాత్రలు పోషించారు. తాజాగా దీనికి సీక్వెల్‌ తెరకెక్కుతుంది. ఈ మేరకు గురువారం నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ ప్రారంభమయ్యింది. ఇందులో టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించబోతున్నారని దర్శకుడు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రకటించారు. అంతేకాకుండా సమంత పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని వారు తెలిపారు. ‘సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం శ్రీకాంత్‌ (మనోజ్‌ బాజ్‌పేయీ) తన కుటుంబసభ్యులతో కలిసి టూర్‌కు వెళ్లాడు. త్వరలోనే తాను వస్తాడని మేము ప్రామిస్‌ చేస్తున్నాం.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు సమంత సైతం ఇన్‌స్టా వేదికగా దీనికి సంబంధించి ఓ పోస్ట్‌ పెట్టారు. ‘నేను నటించబోతున్న మొదటి వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2′. దీని కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఓ డ్రీమ్‌ రోల్‌ను నాకు ఇచ్చినందుకు ప్రతిఒక్కరికీ నా ధన్యవాదాలు’ అని సమంత తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu