HomeTelugu Trendingతమిళ నటుడు G. మరిముత్తు కన్నుమూత

తమిళ నటుడు G. మరిముత్తు కన్నుమూత

Kollywood actor g marimuthu

తమిళ నటుడు, దర్శకుడు G. మరిముత్తు కన్నుమూశారు. శుక్రవారం ఉదయం స్టూడియోలో ఇందుకు సంబంధించి డబ్బింగ్ చేస్తున్న సమయంలో.. తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మరణంతో తమిళ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. మారి ముత్తు మరణం పట్ల పలువురు సెలబ్రెటీలు తీవ్ర సంతాపం ప్రకటిస్తున్నారు.

ఇక మరిముత్తు రెండు దశాబ్దాలుగా తమిళ ఇండస్ట్రీలో బిజీయెస్ట్‌ నటుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన వందకు పైగా సినిమాల్లో నటించాడు. కేవలం నటుడుగానే కాకుండా రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.

ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేరుగా తెలుగులో ఆయన నటించకపోయినా.. పలు తమిళ డబ్బింగ్‌ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులను పలకరించాడు. చినబాబు, పందెం కోడి-2, సుల్తాన్‌, డాక్టర్‌ వంటి సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. ఎక్కువగా నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లోనే మారిముత్తు కనిపించాడు. ఇక ఇటీవలే రిలీజైన జైలర్‌లో విలన్‌కు నమ్మకస్తుడిగా కీలకపాత్ర పోషించాడు. శంకర్‌ తెరకెక్కిస్తున్న ఇండియన్‌-2లోనూ మారిముత్తు నటించాడు.
.

Recent Articles English

Gallery

Recent Articles Telugu